Joginapalli : జోగినపల్లి జాడ ఎక్కడ ….. ???

Joginapalli : గులాబీ అధినేత కేసీఆర్ కు నిత్యం అందుబాటులో ఉంటూ సేవలు చేసిన జోగినపల్లి సంతోష్ జాడ ఎక్కడ అంటూ గులాబీ శ్రేణులు చెవులు కొరుక్కుంటున్నారు. కేసీఆర్ ఉదయం నిద్ర లేచింది మొదలుకొని , రాత్రి పడుకునే వరకు జోగినపల్లి వెన్నంటి ఉండేవారు. కేసీఆర్ నిద్రపోతేనే సంతోష్ ఇంటికి వెళ్ళేది. తెలంగాణ లో అధికారంలో ఉన్నన్ని నాళ్ళు సంతోష్, సంతోష్ . ఇదే పేరు అటు గులాబీ శ్రేణులతో పాటు, పలువురు ఉన్నతాధికారులు జపం చేసేవారు. ఇప్పుడు జోగినపల్లి పేరు జపించుదామంటే జాడలేకుండా...