CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 26 September 2024, 9:17 am Posted by : coalbelt 24 News

Chiranjeevi : చిరంజీవి పెళ్లి ఎలా కుదిరిందో తెలుసా ?

Chiranjeevi : చిరంజీవి పెళ్లి సంబంధం ఎలా కుదిరిందో చాలా మంది అభిమానులకు తెలియదు. ఒక రోజు చిరంజీవి అల్లు రామలింగయ్య ఇంటికి వెళ్లారు. అల్లు రామలింగయ్య ఇంటిలో చిరంజీవి స్నేహితుడు సత్యనారాయణ అద్దెకు ఉంటాడు. సత్యనారాయణ కోసం అల్లు వాళ్ళ ఇంటికి వెళుతాడు చిరంజీవి. అప్పటికే అక్కడ అల్లు రామలింగయ్య ఇంటి హాల్ లో ఒకావిడ ఉంటుంది.

ఆవిడను సత్యనారాయణ ఉన్నాడా అని అడుగుతాడు చిరంజీవి. అప్పుడు ఆమె పైన గదిలో ఉన్నాడు. వెళ్ళండి అని చెబుతుంది. చిరంజీవి కూడా ఆమె చెప్పిన ప్రకారం వెళ్లి స్నేహితుడు సత్యనారాయణను కలిసి వెళుతాడు. వెళుతూ, వెళుతూ సత్యనారాయణ గది ఉన్న విషయాన్నీ చెప్పిన ఆమెకు అమ్మ వెళ్ళొస్తా అని కృతజ్ఞతగా చెప్పి వెళుతాడు చిరంజీవి. అప్పటి వరకు ఆ ఇల్లు అల్లు రామలింగయ్య ఇల్లు అని చిరంజీవి కి తెలియదు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

వెంటనే ఆమె సత్యనారాయణ ను పిలుస్తుంది. సత్యనారాయణ ఇప్పుడు నీ వద్దకు వచ్చిన నీ స్నేహితుడు చిరంజీవి కదా అని అడుగుతుంది. అందుకు సత్యనారాయణ కూడా అవును ఆయన సినిమాల్లో నటిస్తున్న చిరంజీవి అని చెబుతాడు. అప్పుడు ఆమె చిరంజీవి ని తన ఇంటి అల్లుడిని చేసుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఆమె ప్రయత్నాలు ఫలించాయి. ఆమె ఎవరో కాదు అల్లు రామలింగయ్య భార్య, చిరంజీవి భార్య సురేఖ తల్లి ” కనకరత్నం “. కనకరత్నం చూసి చేసిన మొదటి ప్రయత్నంలోనే చిరంజీవి అల్లు రామలింగయ్య ఇంటి అల్లుడు అయిపోయారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});