Singareni : పదోన్నతి కంటే భాద్యతనే ప్రధానమైనది
Singareni : ఉద్యోగంలో చేరిన ఏ వ్యక్తికయినా పదోన్నతి కంటే ఉద్యోగ భాద్యతలు ప్రధానమైనవని సింగరేణి శ్రీరాంపూర్ వైద్యాధికారి డాక్టర్ కిరణ్ రాజ్ స్పష్టం చేశారు. అదనపు ముఖ్య వైద్యాధికారిగా పదోన్నతి పొంది బదిలీ పై వెళుతున్న సందర్బంగా ఆయనను శ్రీరాంపూర్ ఏరియా ఎస్సీ , ఎస్టీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా ఆయన అసోసియేషన్ నాయకులును, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ పదోన్నతి గురించి ఉద్యోగి ఎదురు చూడరాదన్నారు. నిబంధనల మేరకు పదోన్నతి తనంతట తానే ఉద్యోగి వద్దకు వస్తుందన్నారు....