KCR AND Harish : కేసీఆర్ మౌనం…. హరీష్ రావ్ కు వరం
KCR AND Harish : రాజకీయాల్లో అదృష్టం ఎదురుగ ఎవరికీ రాదు. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అప్పుడే ఆ అవకాశం అదృష్టంగా మారుతుంది. మాజీ మంత్రి హరీష్ రావ్ ఎలాగూ అదృష్టవంతుడే. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో చేరిన నాటి నుంచి అందివచ్చిన ప్రతి అవకాశాన్ని తనదయిన శైలిలో సద్వినియోగం చేసుకున్నారు. రాష్ట్ర మంత్రి వరకు ఎదిగారు. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఉన్నప్పటికీ గీత దాటి దూకుడుగానే పనిచేస్తున్నారు. గులాబీ బాస్ మాత్రం మౌనంగానే ఉన్నారు. ఆయన నాలుగు గోడల వరకే పరిమితం...