brs : బిఆర్ఎస్ కు ఆ విషయం తలనొప్పిగా మారిందా ?
brs : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకొంది. సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాల్లో హైడ్రా ఒకటి కావడం విశేషం. రాజకీయంగా ఎలాంటి ఎదురుదెబ్బ తగిలనా పరవాలేదు. హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలను నిర్మూలించాల్సిందే అనే పట్టుదలతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. ఒకరకంగా చెప్పాలంటే సీఎం మొండిగానే హైడ్రా తో యుద్ధం చేస్తున్నారనే అభిప్రాయాలు రాష్ట్రవ్యాప్తంగా వ్యక్తమవుతున్నాయి. వెనుకడుగు వేయకుండా ముందుకు వెళితే మరో పదేళ్లు ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగుతారనే అభిప్రాయాలు సైతం రాజకీయ...