CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 28 August 2024, 5:17 pm Posted by : coalbelt 24 News

MLC Kavitha : ఎమ్మెల్సీ కవిత అడుగులు ఎటువైపు ?

MLC Kavitha : తెలంగాణ ఉద్యమకారుడు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత. ఆమె ఎట్టకేలకు ఐదు నెలల అనంతరం జైలు నుంచి బయటకు వచ్చారు. తెలంగాణ ఉద్యమం నుంచి మొదలు కొని జైలుకు వెళ్లే వరకు కూడా ఆమె రాజకీయ నాయకురాలిగానే కొనసాగారు. ఎంపీగా, ఎమ్మెల్యేగా ప్రజల్లో ఉన్నారు. ఎంపీగా ఓటమి చెందినప్పటికీ ఆమె ప్రజల మనిషిగానే కొనసాగారు.

కానీ జైలు నుంచి బయటకు రాగానే ఆమె ఢిల్లీలో మీడియా సమక్షములో మాట్లాడిన మాటలు రాజకీయ వర్గాల్లో ప్రధాన చర్చకు తెరలేపింది. నేను మొండి వ్యక్తిని. కానీ నన్ను జైలు కు పంపడంతో జగమొండి అయ్యాను. నన్ను అకారణంగా జైలుకు పంపారు. వాళ్లకు వడ్డీతో సహా తప్పకుండ చెల్లిస్తాను. అందుకు తగిన సమయం కూడా వస్తుంది. అంటూ మాట్లాడిన మాటలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారాయి. రేపటి నుంచి ఆమె రాజకీయ కార్యాచరణ ఏ విదంగా ఉండబోతున్నది అనేది బిఆర్ఎస్ శ్రేణుల్లో ఆసక్తికరంగా ఉంది.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పరాజయానికి కవిత మీద వచ్చిన లిక్కర్ ఆరోపణలు కూడా కొంత మేరకు ప్రధాన కారణమైనాయి. అప్పుడే కేసీఆర్ కవిత మీద కోపం వ్యక్తం చేసినట్టు సమాచారం. లిక్కర్ కుంభకోణంలో ఆరోపణలు రావడంతో ఆమె రాజకీయాలకు దూరంగా ఉంటారనే ప్రచారం కూడా గులాబీ శ్రేణుల్లో జరిగింది.

కొన్నాళ్లపాటు కవితను గులాబీ అధినేత కేసీఆర్ రాజకీయాలకు దూరం పెడతారనే ప్రచారం కూడా పార్టీలో జరిగింది. కానీ ఆమెకు బెయిల్ రావడంతో రాజకీయ కార్యాచరణ ఎలా ఉంటుంది అనేది కూడా ఇప్పుడు పార్టీలో ప్రధాన చర్చ జరుగుతోంది. కవిత రాజకీయ ప్రయాణంపై రాజకీయ వర్గాల్లో చర్చలు కూడా మొదలైనాయి.

కానీ కవిత బెయిల్ నుంచి బయటకు రాగానే ఢిల్లీలో ఆమె చేసిన ప్రకటన కూడా పెద్ద చర్చకు దారి తీసింది. వడ్డీ తో సహా ఎవరిమీద
తీర్చుకుంటుంది అనేది ఆమెనే చెప్పాల్సి ఉంది. తగిన సమయంలో వడ్డీతో సహా చెల్లిస్తా అంటే ఆ సమయం కోసం కవిత రాజకీయంగా ఎదురుచూస్తున్నట్టే అని ఆమె చెప్పకనే చెప్పేసింది. రాజకీయాల నుంచి వైదొలిగే ప్రసక్తి లేదని, గతానికి మించి బిన్నంగా రాజకీయంగా పరుగులు తీస్తానని స్పష్టంగా చెప్పేసింది కవిత.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});