Jump Jilanee : బిఆర్ఎస్ కు మరో ఎదురు దెబ్బ ?

Jump Jilanee : భారత రాష్ట్ర సమితి ఘోర పరాజయాన్ని మూట గట్టుకున్న నాటి నుంచి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిచెందిన వారితో పాటు, గెలిచిన వారు సైతం పార్టీని వీడుతున్నారు. చివరకు పార్లమెంట్ ఎన్నికల్లో సైతం పార్టీ నష్టాన్నే మూటగట్టుకుంది. మరోవైపు అధినేత కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత జైలు కు వెళ్లడంతో పార్టీ శ్రేణుల్లో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. కూతురును కాపాడుకోలేని నాయకుడు, పార్టీ నాయకత్వాన్ని ఎలా కాపాడుతాడని గుసగుసలు మొదలైనాయి. కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తరువాత...