CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 11 August 2024, 3:58 pm Posted by : coalbelt 24 News

PCC President : పీసీసీ పదవి ఆ నలుగురి మధ్యే పోటీ …..

PCC President : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి కొనసాగుతున్నారు. ఒక్కరికే రెండు పదవులు ఉండటం పార్టీ నిబంధనలకు విరుద్ధం. పార్టీ అధికారంలోకి రాకముందు నుంచే రేవంత్ రెడ్డి పీసీసీ భాద్యతలు చేపట్టారు. ఇప్పుడు ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. కాబట్టి పార్టీ భాద్యతలను మరొకరికి అప్పగించాలి. సీఎం విదేశీ పర్యటనలో ఉన్నారు. కాబట్టి ఆయన వచ్చిన తరువాత పీసీసీ పదవితో పాటు భర్తీ చేయనున్న కార్పొరేషన్, నామినేటెడ్ పదవులతో పాటు పార్టీలో ఖాళీగా ఉన్న పదవులను కూడా భర్తీ చేయనున్నారు.

కాంగ్రెస్ లో మాత్రం ఏ పదవికి లేనంత పోటీ పీసీసీ పదవికి ఏర్పడింది. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి నలుగురు సీనియర్ నాయకులు పోటీ పడుతున్నారు. కొత్త పీసీసీ అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్న వారిలో ప్రస్తుత పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్, ఎంపీ బలరాం నాయక్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ఈ నలుగురు మాత్రం ఎవరికి వారే ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. ఒకవైపు రాష్ట్రంలో ముఖ్య మంత్రి తో పాటు పలువురు మంత్రుల చుట్టూ కూడా ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇక్కడితో ఆగకుండా ఢిల్లీ లో పార్టీ పెద్దల వద్దకు వెళ్లి తమ సేవలను చెప్పుకుంటున్నారు. పార్టీ అధ్యక్ష భాద్యతలు చేపట్టడం అంత ఆషామాషి వ్యవహారం కాదు. ముఖ్యమంత్రి తోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి మెలిసి ఉండాలి.

పార్టీ సహచరులతో సమన్వయము చేసుకొని పార్టీని ముందుకు తీసుకు వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పుడు ఉన్న ప్రతిపక్ష పార్టీలు కూడా బలంగానే ఉన్నవి. వాటిని తిప్పికొట్టే సామర్ధ్యం కూడా ఉండాలి. ఢిల్లీ నుంచి వచ్చే పెద్ద నాయకుల పర్యటన ఏర్పాట్లు చేసుకోవాలి. ఒక రకంగా చెప్పాలంటే పీసీసీ అధ్యక్ష పదవి ఒక మూళ్ళ కిరీటం తో సమానం.ఎవరు ఆ ముళ్ల కిరీటాన్ని పెట్టుకుంటారో వేచి చూద్దాం.

Author




(adsbygoogle = window.adsbygoogle || []).push({});