CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 09 August 2024, 11:44 am Posted by : coalbelt 24 News

Mahesh Babu : ఆమ్మో, మహేష్ బాబుకు అప్పుడే అంత వయసా ?

Mahesh Babu : తెలుగు చిత్ర పరిశ్రమ హీరో మహేష్ బాబు ఎప్పటికి నవయువకుడిలా కనిపిస్తాడు. అతని వయసు ఎంత పెరిగినా తరగని అందం. అయన కలల రాజకుమారుడే. తెలుగు చిత్ర పరిశ్రమను యువరాజులా ఏలుతున్నాడు. మహేష్ దూకుడు ను ఎవరు కూడా తట్టుకోలేకపోతున్నారు. మురారిలా మురిపించాడు. పోకిరిలా తనేమిటో చూపించాడు. తనకంటే సరిలేరు ఎవ్వరు అంటూ తానే ఏక్ నెంబర్ అన్నాడు. తెలుగు చిత్ర పరిశ్రమకు బిజినెస్ అయ్యాడు. ఒకవైపు అభిమానులకు సినిమాల్లో కనిపిస్తున్నాడు. మరోవైపు వ్యాపార రంగంలో కూడా తనదయిన ముద్రవేశాడు.

మొదటిసారి మహేష్ బాబు వెండితెరపై 1979 లో ” నీడ ” సినిమాలో కనిపించాడు. హీరోగా 1999 లో ” రాజకుమారుడు ” సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోగా పరిచయమయ్యాడు. మహేష్ బాబు ఇప్పటివరకు నలబై వరకు సినిమాల్లో నటించాడు. హైదరాబాద్ లో అయన నివసించే ఇంటి ఖరీదు దాదాపుగా ముప్ఫయ్ కోట్లు ఉంటదని సినీ వర్గాల్లో టాక్. అప్పుడప్పుడు విరామం కోసం కుటుంబంతో కలిసి విదేశాలకు వెళుతాడు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ఇప్పుడు మహేష్ బాబు వయసు సరిగ్గా 49 సంవత్సరాలు. ఈ రోజు ఆయన పుట్టిన రోజు. అభిమానులు శుభాకాంక్షలతో ముంచెత్తుతున్నారు. ఇంత వయసు వచ్చినా అయన అందం ఆయనకే సొంతం. ఆయన ఆస్థి దాదాపు మూడు వందల కోట్ల పైబడి ఉంటదని తెలిసింది. సినిమాల్లో అయన తీసుకునే పారితోషకం నుంచి కొంత సేవా కార్యక్రమాలకు కూడా ఖర్చు చేస్తాడని సినీ పరిశ్రమలో పేరు ఉంది.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});