CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 08 August 2024, 1:31 pm Posted by : coalbelt 24 News

Naga Chaitanya : నాగ చైతన్య పెళ్లి కుదిరింది …పెళ్లి కూతురు ఎవరో తెలుసా ?

Naga Chaitanya : ప్రముఖ తెలుగు చలన చిత్ర నటుడు అక్కినేని నాగార్జున కుమారుడు, హీరో నాగ చైతన్యతో గతంలో హీరోయిన్ సమంత ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వారి వివాహం 2017 లో పెద్దల సమక్షములో జరిగింది. కానీ వారిద్దరి వ్యక్తిగత కారణాల వలన 2021 లో దూరమయ్యారు. అప్పటి నుంచి నాగ చైతన్య, సమంత దూరంగానే ఉంటున్నారు.

ఇప్పుడు నాగ చైతన్య మరొకరితో ప్రేమలో పడ్డారని కూడా చిత్రపరిశ్రమలో గుసగుసలు మొదలైనాయి. ఆ వార్త కాస్త నిజమేనంటూ ఈ రోజు నుంచి తెలుగు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. అభిమానులతోపాటు తెలుగు చిత్ర పరిశ్రమ వర్గాలను నిజం చేస్తూ నాగ చైతన్య ఈ రోజు తను ప్రేమించిన అమ్మాయితో నిశ్చితార్తం కూడా జరిగింది. అందుకు సంబందించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గురువారం ఇరువర్గాల కుటుంబ సభ్యుల సమక్షములో నాగ చైతన్య – శోభిత నిశ్చితార్తం జరిగింది.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ఈరోజు ఉద‌యం తొమ్మిది గంటల నలబై రెండు నిమిషాలకు ఇద్దరి కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో సంప్రదాయం ప్రకారం నిశ్చితార్థం జరిగింది. అక్కినేని కుటుంబంలోకి శోభిత‌కు మ‌నస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాను అంటూ నాగార్జున ట్వీట్ చేశారు




(adsbygoogle = window.adsbygoogle || []).push({});