CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 30 July 2024, 10:19 am Posted by : coalbelt 24 News

Jabardasth : జబర్దస్త్ కమెడియన్ కు ఎమ్మెల్సీ పదవి ?

Jabardasth : జబర్దస్త్ కామెడియన్ కు అదృష్టం కలిసొచ్చింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆయన ఒక నాయకుడి గెలుపు కోసం విస్తృత ప్రచారం చేశారు. ఆ నాయకుడు కూడా విజయం సాధించి రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి కూడా అయ్యాడు. ఇప్పుడు ఆయన మద్దతుతో ఎమ్మెల్సీ పదవి ఆ జబర్దస్త్ కమేడియన్ ను వరించబోతోంది. ఈ విషయం తెలియడంతో కమెడియన్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకూ ఆ కమెడియన్ నటుడు ఎవరంటే….హైపర్ ఆది….




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది తన వాక్చాతుర్యంతో మెగా కుటుంబానికి అభిమాని అయ్యాడు. నాగబాబు ద్వారా సినిమాల్లో అడుగుపెట్టాడు. టాలీవుడ్ నటుడిగా హైపర్ ఆది ప్రస్తుతం బిజీ నటుడు అయ్యాడు. శ్రీదేవి డ్రామా కంపెనీ యాంకర్ గా కూడా బిజీ అయ్యాడు. జనసేన పార్టీ తరపున ఇటీవల ఏపీ లో జరిగిన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ తరుపున విస్తృత ప్రచారం నిర్వహించారు. పవన్ కళ్యాణ్ ను విపరీతంగా పొగుడుతూ మరింత మెగా కుటుంబానికి దగ్గర అయ్యాడు. సెటైర్లు, డైలాగ్స్ పంచ్ లతో ఆది అభిమానులను సంపాదించుకున్నాడు. పవన్ కళ్యాణ్ విజయం సాధించి, డిప్యూటీ సీఎం కావడంతో ఆది కి మంచి గుర్తింపు వచ్చింది. జనసేన పార్టీ తరపున ప్రచారం చేయడంతో ఆది రాజకీయ ప్రవేశం చేసినట్టు అయ్యింది.

ఈ నేపథ్యంలో హైపర్ ఆది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు సన్నిహితుడు అనే పేరు వచ్చింది. ఎన్నికల ప్రచారంలో విస్తృత ప్రచారం చేశాడు. కాబట్టి హైపర్ ఆది త్వరలోనే ఏపీ లో ఎమ్మెల్సీ కావడం ఖాయం అంటూ జబర్దస్త్ బృందంతో పాటు, తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా పెద్ద టాక్ అయ్యింది. ఇది ఇలా ఉండగా హైపర్ ఆది మాట్లాడుతూ తాను ఎలాంటి రాజకీయ పదవులను మాత్రం ఆశించడం లేదని స్పష్టం చేయడం విశేషం.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});