CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 29 July 2024, 2:29 pm Posted by : coalbelt 24 News

Great Actor : అంతా పోగొట్టుకుంది…ఆత్మహత్యకు సిద్దమైనది….ఇప్పుడు కోట్లకు పడగలెత్తింది. ఆ నటి …

Great Actor : సినీ పరిశ్రమలో అడుగు పెట్టాలనుకునే వారు ఎన్నో ఆశలతో వస్తుంటారు. వాళ్ళు వచ్చేనాటికే కొందరు నటులు స్థిరపడి పోతారు. వాళ్ళతో పోటీని తట్టుకోవాలి. తాను నిలదొక్కుకోవాలి. అప్పుడే ఆ సినిమా ప్రపంచంలో అగ్రస్థానానికి ఎదుగుతారు. ఇదంతా జరగాలంటే ప్రతిభ, నటన, కష్టపడేతత్వం తప్పనిసరి. పోటీ తట్టుకోలేని వారు కొందరు ఇంటి ముఖం పడుతారు. మరికొందరు వేరే దారి చూసుకుంటారు. ఇంకొందరు అయితే ఆత్మహత్య చేసుకుంటారు. కానీ ఒక నటిగా స్థిరపడిపోవాలని అనుకొని పరిశ్రమలో అడుగుపెట్టింది ఆమె. కానీ ఉన్నదంతా పోగొట్టుకొంది. తప్పనిసరి పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకోవాలని సిద్దమైనది. కానీ ఇప్పుడు ఆమె అగ్రస్థానంలో నిలిచింది. కోట్లకు పడగలెత్తింది. ఎవరు ఆమె ? ఇప్పుడు తెలుసుకుందాం….

చిత్ర పరిశ్రమలో అగ్రస్థానానికి చేరుకున్నప్పుడే ఆమె పెళ్లి చేసుకొంది. పెళ్లైన ఐదేళ్లకే భర్తతో విడాకులు. చేసిన అప్పులు తీర్చలేని పరిస్థితి. అప్పులు తీర్చడానికి ఇంటిని అమ్మేసింది. వీటికి తోడు అదనంగా అనారోగ్యం. ఈ బాధలన్నీ తొలగాలంటే ఆత్మహత్య ఒక్కటే మార్గమని సిద్దమైనది. కానీ తనలో ఉన్న ప్రతిభతో కష్టపడింది. ఇప్పుడు చిత్ర పరిశ్రమనే ఏలుతోంది. కోట్లకు పడగలెత్తినది. కోల్పోయిన సంపాదనను తిరిగి సంపాదించుకొంది. ఆ నటి ఎవరంటే ??? రష్మీ దేశాయ్ ..




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

హిందీ పరిశ్రమతో పాటు టీవీ సీరియల్స్ లో తన ప్రతిభను చాటుకొంది. గత ఇరువై ఎల్ల నుంచి తిరుగులేని నటిగా కొనసాగుతోంది.అస్సామీ, భోజ్‌పురి, హిందీ సినిమాల్లో అధికంగా నటించింది. ఇప్పుడు ఆమె సమయం కోసం పెట్టుబడిదారులు ఎదురుచూస్తున్నారు.

హిందీ బుల్లి తెరపై 2006 లో అడుగుపెట్టింది. దింతో ఉత్తరాదిన ఆమె అంటే తెలియని వారు లేరు. ‘కన్యాదాన్’ అనే అస్సామీ చిత్రంతో దేశాయ్ మొదటిసారి చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. అక్కడితో ఆగకుండా , మోనాలీసా, దబాంగ్ 2, షబ్నం తదితర బాలీవుడ్ సినిమాల్లో నటించి బోలెడంత అభిమానులను సంపాదించుకొంది.

అనారోగ్యకరమైన వాతావరణం వదిలిపెట్టి ఇప్పుడు ఆనందకరమైన జీవితంలో స్థిరపడిపోయింది. ఇప్పుడు బుల్లితెర పరిశ్రమలో అత్యధిక పారితోషకం తీసుకునే వాళ్ళల్లో దేశాయ్ అందరి కంటే ముందు ఉంది.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});