CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 26 July 2024, 2:02 pm Posted by : coalbelt 24 News

Singareni : సింగరేణి కార్మికులకు రెయిన్ కోట్ ఇవ్వాలి

Singareni : సింగరేణి బొగ్గుగనుల్లో ఉపరితరంలో పనిచేస్తున్న వారితోపాటు, ఓపెన్ కాస్ట్ గనుల్లో పనిచేస్తున్న కార్మికులకు వర్షాకాలంలో రెయిన్ కోట్ ఇవ్వాలని శ్రీరాంపూర్ ఏరియా ఎస్సీ ఎస్టీ సంక్షేమ ఉద్యోగుల సంఘం ఏరియా వైస్ ప్రెసిడెంట్ డేగల ప్రవీణ్ కుమార్ సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన ఏరియాలో నిర్వహించిన యూనియన్ సమావేశంలో నాయకులను, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. పలు గనుల్లో కార్మికులకు డ్రిల్ రాడ్, డ్రిల్ బిట్లు సరఫరా చేయడం లేదని ఆరోపించారు. రక్షణ ఏర్పాట్లు కూడా గనుల్లో అంతంత మాత్రమే ఉంటున్నాయని ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలో కొందరు కార్మికులు గాయాల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశ అనంతరం ఆర్ కె – 5 గని ఫిట్ కమిటీ ని ఎస్సీ ఎస్టీ సంక్షేమ ఉద్యోగుల సంఘం కార్యకర్తలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

RK -5 గని ఫిట్ సెక్రటరీ గా సుందిళ్ల నరేష్, అసిస్టెంట్ పిట్ సెక్రటరీ గా శ్రావణ్, జాయింట్ సెక్రటరీ గా సంకె సతీష్ లను ఎన్నుకున్నారు. ఎన్నికయిన వారిని సంఘం నాయకులు అభినందించారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

కార్యక్రమంలో యూనియన్ కార్యదర్శి రెడపాక లక్ష్మణ్‌, నక్క సుమన్‌ , ఆర్గనైజింగ్ కార్యదర్శి కుక్కా వాసు , కోశాధికారి గోదారి మురళి, SRP3 , Rk6 , Ik 1, Rk7 పిట్ , అసిస్టెంట్ పిట్ సెక్రటరీ లు కమల్, యోసఫ్, దాసు, మహేందర్, ప్రతాప్, గోపాల్, తదితరులు పాల్గొన్నారు.

Author




(adsbygoogle = window.adsbygoogle || []).push({});