Encounter : ములుగు జిల్లాలో ఎన్కౌంటర్…మావోయిస్టు మృతి
Encounter : ములుగు జిల్లా సరిహద్దు ప్రాంతంలోని అడవుల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ములుగు జిల్లా ప్రత్యేక పోలీస్ బలగాలు సంయుక్తంగా కొద్ది రోజుల నుంచి కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాడ్వాయి మండలంలోని గుండాల అడవిలోని దామరతొగు వద్ధ గురువారం ఉదయం పోలీసులకు మావోయిస్టులు ఎదురు పడ్డారు. లొంగిపోవాల్సిందిగా పోలీస్ బలగాలు కోరినప్పటికీ మావోయిస్టులు కాల్పులు ప్రారంభించారు. ఆత్మ రక్షణ కోసం పోలీస్ బలగాలు కూడా ఎదురు కాల్పులు ప్రారంభించారు. ఈ సంఘటనలో ఒక మావోయిస్టు మృతి చెందాడు. మావోయిస్టులు కాల్పులు జరుపుతూ...