CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 22 July 2024, 7:23 am Posted by : coalbelt 24 News

Tollywood hero : ఆ హీరోకు వారసులు లేరు…వందల కోట్ల ఆస్తులు….ఆస్థి ఏమైనది ?

Tollywood star hero : సినీపరిశ్రమకు చెందిన నటీ,నటులు చాలా మంది ఆస్తులు సమకూర్చుకుంటారు. కొందరు ఆర్థికంగా వ్యక్తిగత సమస్యలతో నష్టపోయిన వారు సైతం పరిశ్రమలో ఉన్నారు. కొందరికి వారసులు ఉంటె వారు సంపాదించిన ఆస్థి ఆ వారసులకే దక్కుతుంది. మరి వారసులు లేని నటీ,నటులు ఆస్థి ఎవరికి చెందుతుంది. కానీ ప్రముఖ తెలుగు సినీ హీరో వందల కోట్ల ఆస్తులు సంపాదించాడు. అతను సంపాదించిన ఆస్తిని అనుభవించడానికి వారసులు లేరు. ఇంతకు ఎవరు ఆ హీరో. అతని గురించి తెలుసుకుందాం.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

1975లో రామరాజ్యం సినిమాలో మొదటిసారి నటించాడు శరత్ బాబు. ఆ తరం నటులు జగ్గయ్య, సావిత్రి, ఎస్వీ రంగారావు వంటి ప్రముఖ నటులకు దీటుగా నటించి అభిమానులను సంపాదించుకున్నాడు. 1976లో రాజా సినిమాలో న్యాయవాది పాత్రతో ప్రేక్షకులను మరింత మెప్పించాడు. అప్పటినుంచి తిరుగులేని నటుడిగా దూసుకువెళ్ళాడు. 1977 లో తమిళం సినీ పరిశ్రమలో ప్రవేశం. అప్పటినుంచి తిరుగులేని నటుడిగా తన ప్రతిభను చాటుతూ అగ్రశ్రేణి నటుడు అయ్యాడు. చెన్నయ్ లో విలాసవంతమైన ఇల్లు, విల్లాలు, బెంగళూర్, హైదరాబాద్ లలో కోట్ల రూపాయల విలువచేసే ఆస్తులు సంపాదించి పెట్టాడు శరత్ బాబు. ఇప్పటి వరకు శరత్‌బాబు 250 కు పైగా సినిమాల్లో నటించాడు. చివరిగా వకీల్ సాబ్, మళ్లీ పెళ్లి సినిమాలో నటించాడు.

1971లో నటి రమాప్రభ ను వివాహం చేసుకున్నాడు. కొన్ని కారణాల వలన ఇద్దరు 1988 లో విడాకులు తీసుకున్నారు. అప్పటివరకూ వారిద్దరికీ సంతానం లేదు. 1990 లో ఎంఎన్ నంబియార్ కుమార్తె స్నేగలతా దీక్షిత్‌ను వివాహం చేసుకున్నాడు. ఆ ఇద్దరు కూడా 2011 లో విడాకులు తీసుకున్నారు. ఈ ఇద్దరికి కూడా పిల్లలు లేరు. 2023, మే 22 న నటుడు శరత్ బాబు తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయాడు.

శరత్ బాబుకు అన్నదమ్ములు ఉన్నారు. తోబుట్టువులలో శరత్ బాబు నాలుగో వ్యక్తి. శరత్ బాబును తోబుట్టువులు అందరు కూడా తండ్రిలా చూసుకునేవారు. శరత్ బాబు సంపాదించిన ఆస్తి కి సంబందించిన వీలునామాలో ఎవరిపేరు నమోదయి ఉంటె వాళ్లకే ఆ ఆస్తి దక్కుతుంది. లేదంటే, శరత్ బాబు కుటుంబీకులు ఆస్తులు పంచుతారు. ఆస్తలు గురించి ఎవరు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదని అప్పట్లో శరత్ బాబు సోదరుడు ఓ సందర్భంలో వెల్లడించారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});