CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 21 July 2024, 5:58 am Posted by : coalbelt 24 News

Good Health : పాలతో సమానమైన బలమైన పదార్థం మరొకటి ఉంది. దాన్ని తింటే ఎంతో శరీరానికి మేలు

Good Health : పాలతో పెరుగు, మజ్జిగ, వెన్న, నెయ్యి తయారవుతాయి. ఈ పదార్థాలన్నీ కూడా మన శరీరానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వలన శరీరంలోని ప్రతి భాగం ఆరోగ్యాంగా ఉంటుంది. అదేవిదంగా పాలకు సంబంధించిన మరొక పదార్థం కూడా ఉంది. పాలతో సమానమైన పదార్థం జున్ను.

జున్నులో కొవ్వు, క్యాలరీలు కొంత వరకు ఉంటాయి. ఈ పదార్థాన్నినిరంతరం తినడం కూడా మంచిది కాదు. గర్భిణి స్త్రీలు జున్నులో సరిపడేంత చక్కెర లేదా తేనె కలిపి తీసుకుంటే పుట్టబోయే శిశువు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పుట్టిన బిడ్డకు సరిపడేంత తల్లి పాలు రాకుంటే బాలింతలు జున్ను తింటే చాలా మంచిది. జున్ను తినడం వలన చర్మం సౌందర్యంగా అవుతుంది.పాలకంటే జున్నులో అధికంగా పోషక విలువలు ఉంటాయి. జున్ను పాలలో ప్రోటీన్, కాల్షియం, విటమిన్లు, ఖనిజాలు ఎక్కువ మోతాదులో ఉంటాయి.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

దీనిలోని ప్రోటీన్ కండరాల నిర్మాణానికి , నిర్వహణకు ఉపయోగపడుతుంది. జున్నులోని ప్రోటీన్ శరీరానికి అవసరమైనంత బలాన్ని ఇస్తుంది. జ్ఞాపకశక్తి మెరుగవుతుంది. దీనిలో కాల్షియం అధికంగా ఉంటుంది. ఎముకలు, దంతాలు బలంగా తయారవుతాయి. తరచుగా తినడంవలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రక్తపోటు అదుపులో ఉంటుంది. జీర్ణవ్యవస్థ మెరుగవుతుంది. అజీర్తి తొలగిపోతుంది. విటమిన్లు A, B12 , K ఉంటాయి. పొటాషియం, మెగ్నీషియం, జింక్ అధికంగా ఉంటాయి. గుండె సమస్యలు ఉన్నవారు తినడం డాక్టర్ ను సంప్రదించాలి.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});