CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 07 July 2024, 4:03 pm Posted by : coalbelt 24 News

Rajya Sabha: కేకే రాజ్యసభ సీటు ఎవరికిస్తారు..?

Rajya Sabha: రాజకీయ ఉపాధి అవసరాల నేపథ్యంలో బిఆర్ఎస్ నుంచి వెళ్లిపోయి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు కె కేశవరావు (కేకే). పార్టీ మారిన నేపథ్యంలో ఆయన రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు. అందుకు త్యాగ పళంగా కేకే కు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ సలహాదారునిగా నియమించింది. ఇప్పుడు ఆయన పదవి ఖాళీ అయ్యింది. ఖాళీ అయిన స్థానాన్ని ఎవరికీ కేటాయిస్తారు అనే చర్చ రాష్ట్రము నుంచి మొదలుకొని ఢిల్లీ వరకు కాంగ్రెస్ శిభిరంలో జరుగుతోంది. ఖాళీ అయిన స్థానాన్ని తెలంగాణ నేతలకు ఇస్తారా ? లేదంటే ఇతర రాష్ట్రాల సీనియర్ నేతలకు ఇస్తారా అనేది కూడా తేలాల్సి ఉంది.

తెలంగాణ రాష్ట్రము నుంచి కూడా ఆశిస్తున్నవారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ఎంపీ టికెట్ త్యాగం చేసిన పలువురు కూడా హామీలను గుర్తుకు చేస్తున్నారు. అదేవిదంగా పార్టీని నమ్ముకొని ఉన్నవారు కూడా రాజ్యసభ పదవి కోసం పోటీపడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ని నమ్ముకున్నవారితో పాటు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ను నమ్ముకున్న వారు కూడా వాళ్ళ చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైనది.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

కేకే రాజీనామాతో రాజ్యసభ సీటు ప్రధాన చర్చ అయ్యింది. కేకే తెలంగాణ ప్రాంతం నాయకుడు కావడంతో ఆయనకే దక్కుతుందనే అభిప్రాయాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. ఆయనకు ప్రభుత్వ సలహా దారునిగా నియమించిన నేపథ్యంలో మరోసారి రాజ్యసభ పదవి ఇవ్వరు అనేది ప్రధాన అంశం. పార్టీలో కీలక నేతకే అప్పగిస్తారనే అభిప్రాయాలు సైతం వ్యక్తం అవుతున్నాయి.

ఏఐసీసీ అధికార ప్రతినిధి, సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ అభిషేక్‌ మను సింఘ్వీ ని కేకే స్థానంలో భర్తీ చేయనున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. అధిష్టానం దాదాపుగా ఆయనకే గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చినట్టు ఢిల్లీ లో పొలిటికల్ టాక్ నడుస్తోంది. రాజ్యసభ స్థానానికి జరిగిన ఎన్నికలో అభిషేక్ సింఘ్వీ హిమాచల్‌ప్రదేశ్‌ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. పార్టీ అవసరాల నేపథ్యంలో ఆయనను మరో చోట నుంచి రాజ్యసభకు పంపాలని కాంగ్రెస్‌ హైకమాండ్‌ ఆలోచిస్తున్నట్టు కాంగ్రెస్ శ్రేణుల సమాచారం.

Author




(adsbygoogle = window.adsbygoogle || []).push({});