Singareni : మా సింగరేణి మాకే కావాలి ….

Singareni : తెలంగాణ రాష్ట్రంలో ఎందరికో ఉపాధినిస్తున్న సింగరేణి బొగ్గుగనులను కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయరాదని డిమాండ్ చేస్తూ శుక్రవారం కొత్తగూడెం సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట సింగరేణి ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు, కార్యకర్తలు ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్బంగా అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ వంద ఏళ్లుగా సింగరేణి గనులు కార్మిక కుటుంబాలతో పాటు ప్రైవేట్ పరంగా ఎందరికో ఉపాధినిస్తున్నాయన్నారు. సింగరేణి యాజమాన్యం సొంతంగా బొగ్గు ఉత్పత్తి చేపట్టడం వలన తెలంగాణ ప్రాంత నిరుద్యోగులకు ఉపాధి...