CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 05 July 2024, 2:39 pm Posted by : coalbelt 24 News

Guru Purnima : గురు పౌర్ణమి ఎప్పుడు వస్తుంది….ఆరోజు ఎలాంటి పూజ చేయాలి.

Guru Purnima : గురు పొర్ణమి అంటేనే మహా భారతం గ్రంథాన్ని రాసిన వేద వ్యాసుడు పుట్టిన రోజు. గురు పౌర్ణమి రోజును వ్యాసమహర్షి జన్మ దినంగా జరుపు కుంటారు. ఆ రోజును పురస్కరించుకొని ఉపవాసంతో ప్రత్యేక పూజలు చేసి తమ భక్తిని చాటుకుంటారు. విద్యాసంస్థల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులు వ్యాస మహర్షికి పూజలు చేసి కొలుస్తారు. గురు పౌర్ణమిని ఆషాడ పౌర్ణమి అనికూడా పిలుస్తారు. ఆషాడ మాసంలో వచ్చే శుక్ల పక్ష పౌర్ణమి రోజున గురు పౌర్ణమి జరుపుకుంటారు. అయితే ఈ ఏడాది గురుపౌర్ణమి ఈరోజు వస్తుంది అనేది పలువురికి అనుమానంగా ఉంది. దానికి సంబంధించిన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం…..

వేద పండితులు పంచాంగం ప్రకారం ఏమి చెబుతున్నారంటే…. ఆషాడ మాసంలో పౌర్ణమి తిధి జూలై 20వ తేదీన సాయంత్రం 6 గంటలకు గురు పౌర్ణమి గడియలు ప్రారంభమవుతుతాయి. మరుసటి రోజు అంటే జూలై 21 న సాయంత్రం 3:47 గంటలకు పౌర్ణమి ముగుస్తుంది.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

వేదంలో చెప్పబడిన ప్రకారం చంద్రోదయ సమయాన్ని మాత్రమే పూర్ణిమ తిథిగా భావిస్తాం. అదే రోజు పున్నమి కాబట్టి ఉపవాసం ఉంటాం. పూర్ణిమ తిథి ఎప్పుడు ఉంటుందో ఆరోజు ఉపవాసంతో వ్యాస మహర్షికి పూజలు చేసి తమ భక్తిని చాటుకుంటారు. జూలై 20న ఉపవాసం, ప్రత్యేక పూజలు చేసి ఉపవాస దీక్ష విరమించాలి. మరుసటి రోజు దాన ధర్మాలు చేయాలని వేదం పండితులు చెబుతున్నారు.

Author




(adsbygoogle = window.adsbygoogle || []).push({});