Congress : కాంగ్రెస్ @ 80….

Congress : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలతో ఐదు రోజులపాటు మంతనాలు జరిపారు. అక్కడ ఒకవైపు మంతనాలు జరుపుతూనే, రాష్ట్రంలో చేరికలు సంభందించిన పావులు కదిపారు. ఆయన వచ్చి రావడంతోనే గులాబి పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్సిలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అంటే అధిష్టానం ఆశీస్సులతోనే చేరికల కార్యక్రమానికి తెరలేపినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సొంతంగా 64 స్థానాల్లో విజయ పథకాన్ని ఎగురవేసింది. కంటోన్మెంట్కు జరిగిన ఉపఎన్నిక కూడా తన ఖాతాలో వేసుకోవడంతో అసెంబ్లీలో...