CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 02 July 2024, 7:15 am Posted by : coalbelt 24 News

Pradosh Vratam: ప్రదోష వ్రతం ఎప్పుడు ? … ఏ వస్తువులను దానం చేయాలి

Pradosh Vratam : ఇంటిలోని కుటుంబ సభ్యులు అందరూ సుఖ సంతోషాలతో గడపాలని కుటుంబంతో సహా వ్రతాలు చేస్తారు. నోములు చేస్తారు. ఉపవాస దీక్షతో ఉంటారు. హోమం నిర్వహిస్తారు . ఇలా రకరకాల పూజలు భక్తితో చేసి దేవుని ఆశీర్వాదం పొందుతారు. వ్రతాలల్లో ప్రదోష వ్రతం అనేది ఒకటి కూడా ఉంది. ఈ వ్రతం ఏ మాసంలో ఏ రోజు వస్తుంది. ఆరోజు ఏదేవునికి చెందుతుంది. వ్రతం చేసిన తరువాత ఏ వస్తువులను దానం చేయాలి అనే విషయాలు కొందరు వేదం పండితులు చెప్పిన ప్రకారం ఈ విదంగా ఉన్నవి.

పంచాంగం ప్రకారం జేష్ఠ మాసంలో వచ్చే కృష్ణ పక్షం రోజున త్రయోదశి న జూలై మూడో తేదీన ఉదయం 7:10 గంటల నుంచి మొదలుకొని జూలై 4తేదీన ఉదయం 5:54 గంటల వరకు ముహూర్తం ఉంటుంది. ప్రదోష కాలంలో చేసే పూజ చాలా ఉపయోగపరంగా కుటుంబానికి ఉంటుంది. ముహూర్తం ప్రకారం జులై మూడో తేదీన మాత్రమే ప్రదోష వ్రత ఉపవాసం పాటిస్తే చాలా మంచిది.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ప్రదోష వ్రతంలో శివ పార్వతులతో పాటు వినాయకుడిని కూడా పూజిస్తారు. నియమ నిష్ఠలతో ఉపవాసం ఉండి వ్రతం చేస్తే ముక్తి కలుగుతుంది. వ్రతం చేయడం వలన ఇంటి కుటుంబ సభ్యులు అందరు కూడా ఆరోగ్యముగా, సుఖ, సంతోషాలతో ఉంటారు. అంతేకాదు చిరు వ్యాపారస్తులు మొదలుకొని పెద్ద, పెద్ద వ్యాపారస్తులు కూడా ఈ వ్రతం చేసిన నేపథ్యంలో వ్యాపారం కూడా అన్నివిధాలుగా అభివృద్ధి చెందుతుంది. చేస్తున్న ఉద్యోగంలో కూడా ఏమైనా ఇబ్బందులు ఉంటె తొలిగిపోడానికి అవకాశాలు ఉన్నాయని వేదంలో చెప్పబడింది.

దానం చేయాల్సినవి : అవును దానం చేయడం వలన పుణ్యంతో పాటు సిరిసంపదలు పెరుగుతాయి. నల్ల నువ్వులు దానం చేయడం వలన శివుని అనుగ్రహం లభిస్తుంది. గ్రహాల దోషం ఉంటె కూడా తొలగిపోతుంది. ఫలములు దానం చేయడం వలన గ్రహాల స్థితి బలపడుతుంది. ఆరోగ్య ప్రయోజనం కలుగుతుంది.

వస్త్ర దానం చేయడం వలన పుణ్యకార్యంగా భావిస్తారు. పేదలకు వస్త్రములు దానం చేయడం వలన సుఖ సంతోషాలతో ఉంటాం. ఇంటి ముందర పక్షులు నీరు తాగే విదంగా ఏర్పాటు చేస్తే, ఆ నీటిని పక్షులు తాగడం వలన పుణ్య ఫలితాలు లభిస్తాయి. పితృ దోషాలు ఉంటె కూడా తొలగి పోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి.

 

Author




(adsbygoogle = window.adsbygoogle || []).push({});