Encounter : భారీ ఎన్కౌంటర్… 11 మంది మావోయిస్టులు మృతి
Encounter : ఛత్తీస్ ఘడ్ లోని నారాయణపూర్ జిల్లాలోని కుర్రెవాయి అటవీ ప్రాంతంలో మంగళవారం సాయంత్రం భారీ ఎన్కౌంటర్ జరిగింది. కుర్రెవాయి అటవీ ప్రాంతంలో సుమారు 1400 మంది ప్రత్యేక పోలీస్ బలగాలు గాలింపు చేపట్టాయి. ముందస్తు సమాచారం మేరకు ప్రత్యేక బలగాలు గాలింపు చేపడుతున్న సమయంలో మావోయిస్టులు ఎదురుపడ్డట్టు సమాచారం. ఈ నేపథ్యంలో పోలీస్ బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో 11 మంది మావోయిస్టులు మృతి చెందినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు...