CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 30 June 2024, 5:22 pm Posted by : coalbelt 24 News

Singareni : సింగరేణి చైర్మన్ కు అవార్డు

Singareni : సింగరేణి చైర్మన్ బలరాం కు ట్రీ మ్యాన్ అఫ్ తెలంగాణ అవార్డు వరించింది. చైర్మన్ బలరాం సింగరేణి బొగ్గు గనులు విస్తరించిన ఏరియాల్లో స్వయంగా పద్దెనిమిది వేల మొక్కలు నాటారు. సింగరేణి పరిధిలోని ఆరు జిల్లాల్లోని గనుల ఆవరణల్లోమొక్కలు నాటడంతో 35 చిన్న, చిన్న అడవులుగా నేడు తయారైనాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ గ్రీన్ మ్యాపుల్ అనే స్వచ్చంద సంస్థ చైర్మన్ బలరాంకు ట్రీ మ్యాన్ అఫ్ తెలంగాణ అవార్డును హైదరాబాద్ లో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధానం చేసింది.

ఈ సందర్బంగా బలరాం మాట్లాడుతూ సింగరేణి ఏరియాల్లో మరో రెండువేల మొక్కలను స్వయంగా నాటాలని వ్యగ్తిగత లక్ష్యముగా పెట్టుకున్నానని తెలిపారు. మొక్కలు నాటే సమయంలో బలరాం ఎవరి సహకారం తీసుకోరు. స్వయంగా ఆయనే గోతి తవ్వి మొక్కను నాటడం విశేషం. కొందరు అధికారులు మొక్కను నాటాలనుకుంటే, ముందుగా ఎవరో ఒకరు గోతి తవ్వి సిద్ధంగా ఉంచాలి. ఆ తరువాత సంబంధిత అధికారి వచ్చి మొక్క నాటుతారు. మరొకరు నీరు పోస్తారు. కానీ బలరాం మొక్క నాటే విధానం అందరికంటే బిన్నంగా ఉండటం విశేషం. ఆయనే స్వయంగా గోతి తవ్వుకొని, మొక్కను నాటుతారు. ఎవరి సహాయం తీసుకోరు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});