BRS : కారు దిగుతున్న కీలక నేతలు
BRS : తెలంగాణ రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితి పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారైనది. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం మూటగట్టుకుంది. అధికారం కోల్పోవడంతో కొందరు నాయకులు పొరుగింటి వైపు చూస్తున్నారు.మరికొందరు నేరుగా గులాబీ కండువా పక్కకుపెట్టి, మరో పార్టీ కండువా కప్పుకుంటున్నారు. అసెంబ్లీ పరాజయం నుంచి పార్టీ కోలుకోక ముందే పార్టీకి పార్లమెంట్ ఎన్నికల ఫలితం మరింత కుంగదీసింది. ఈ నేపథ్యంలో పార్టీ అభ్యర్థులుగా గెలిచిన నాయకులు అసెంబ్లీ ఫలితాల నుంచి నేటి వరకు ఒక్కొక్కరుగా గులాబీ కండువా తీసేసి కాంగ్రెస్ కండువా...