CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 23 June 2024, 3:23 pm Posted by : coalbelt 24 News

NIMS Jobs: హైదరాబాద్ నిమ్స్ లో ఉద్యోగాలు….వేతనం రూ: 1 లక్ష పైన

NIMS Jobs: ప్రతిష్టాత్మకమైన హైదరాబాద్ నిజాం ఇన్ డిగ్రీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS) సీనియర్ రెసిడెంట్ పోస్టుల నియామకానికి సంబంధించిన నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మొత్తం 51 పోస్టులను భర్తీ చేయనున్నట్టు నిమ్స్ యాజమాన్యం ప్రకటించింది. జూన్ 26 , 2024 తేదీ లోగ అర్హులైన వారు ఈ పోస్టుకు ధరఖాస్తు చేసుకోవాలని కోరింది.

ఖాళీగా ఉన్న విభాగాలు….




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

క్రిటికల్ కేర్, గైనకాలజీ, మెడికల్ ఇమ్యునాలజీ, ఎండోక్రైనాలజీ, మెడికల్ జెనెటిక్స్, హేమటాలజీ, న్యూరాలజీ, రేడియేషన్, అంకాలజీ, మైక్రోబయాలజీ, జనరల్ మెడిసిన్, పాథాలజీ, రేడియాలజీ, ఇమేజియాలజీ, అనస్థీషియాలజీ డిపార్టుమెంట్లలో ఖాళీగా ఉన్నాయి. సంబంధిత స్పెషాలిటీలో MD/MS/DNB ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవాలి. వేతనం నెలకు అన్ని అలవెన్సులు కలిపి రూ.1,21,641. ఇంటర్వ్యూ, డాక్యుమెంట్స్ పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫారం ఖరీదు రూ: 500 గా నిర్ణయించారు. ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు ఫారంలను డీన్, నిమ్స్, పంజాగుట్ట, హైదరాబాద్‌ చిరునామాకు సకాలంలో పంపించాలి. జూన్ 26 తరువాత చేరిన దరఖాస్తులను తిరస్కరించబడుతాయని నిమ్స్ యాజమాన్యం స్పష్టం చేసింది.

Author




(adsbygoogle = window.adsbygoogle || []).push({});