CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 22 June 2024, 6:56 am Posted by : coalbelt 24 News

Project benifit 82 crores : అతి తక్కువ పెట్టుబడితో ఏడాదికి రు: 82 కోట్లు

Project benifit 82 crores : కోళ్ల పరిశ్రమ చూసాం. చేపల పరిశ్రమలు కూడా పల్లెల్లో కనబడుతున్నాయి. మేకల పరిశ్రమను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇలా రకరకాల పరిశ్రమలు ఉపాధి కోసం వెలిశాయి. వీటి వలన లాభాలు కూడా ఆశించవచ్చు. కానీ కోట్ల కొలది మాత్రం రావు. అతి తక్కువ పెట్టుబడితో అత్యధిక లాభాలు వచ్చే పరిశ్రమ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. తక్కువ పెట్టుబడి. శ్రమ తక్కువ.

వైద్యుడు అవసరం లేదు. ఎండ, వాన, చలి కి తట్టుకునే శక్తి ఉన్న వాటిని పెంచి ఏడాదికి కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారు. కొందరు. ఆ పరిశ్రమ పేరు తేళ్ల పరిశ్రమ. విషపు జంతువు అయిన తేళ్ళ ను పెంచే పరిశ్రమలు వెలుస్తున్నాయి. ఎలాంటి రిస్క్ లేనిది తేళ్ల పెంపకం. వాటిని ఏర్పాటు చేస్తున్నారంటే విచిత్రంగా ఉంది. అవును నిజమే ఇప్పుడు తేళ్ల పరిశ్రమతో ఉపాధి అవకాశాలు పెరిగాయి. తేళ్లను పెంచి అమ్మడం కాదు. వాటి విషం అమ్మి ధనవంతులు అవుతున్నారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

తేలు విషానికి మార్కెట్ లో భారీగా డిమాండ్ ఉంది. అందుకే తేళ్ల పెంపకం పరిశ్రమలను ఏర్పాటు చేస్తున్నారు. కోళ్ల ఫారం మాదిరిగా తేళ్ల ఫారంలు తయారవుతున్నాయి. వేల కొలది తేళ్లను పెంచుతూ ఉపాధి పొందుతున్నారు. తేలు విషాన్ని ఔషద కంపెనీలు కొనుగోలు చేస్తున్నాయి. అదేవిదంగా సౌందర్య సాధనాలు తయారు చేయడానికి కూడా పలు సంస్థలు ఉపయోగిస్తున్నాయి. కొన్ని ఆసియా దేశాల్లో సంప్రదాయిక వైద్య విధానాల్లో తేలు విషానికి అధిక ప్రాధాన్యం ఉంది.

క్యాన్సర్ మందుల తయారీలోనూ తేలు విషం వాడతారని ప్రచారంలో ఉంది. ప్రత్యేక పద్ధతుల్లో విషాన్ని నిల్వ చేస్తున్నారు. ఒక్క తేలు నుంచి రోజుకు 2 మిల్లీ లీటర్ల విషం వస్తుందని నిర్వాహకుల సమాచారం. తేలు కొండి నుంచి విషాన్ని తీస్తారు. ట్వీజర్స్‌తో పిండి విషాన్ని బయటకు తీస్తారు. ఈ ప్రక్రియలో తేలుకు ఎటువంటి ప్రాణ హాని జరగదు..లీటర్ విషం ధర రూ.82 కోట్ల వరకు ఉంటుంది. అందుకే కొందరు తేళ్ల ఫారాలను ప్రారంభిస్తున్నారు.

Author




(adsbygoogle = window.adsbygoogle || []).push({});