CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 22 June 2024, 7:55 am Posted by : coalbelt 24 News

Cental Bank Jobs 2024: టెన్త్ తో బ్యాంక్ ఉద్యోగం… జీతం రూ.37,815

Cental Bank Jobs 2024: దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడానికి సెంట్రల్ బ్యాంక్ అఫ్ ఇండియా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్ట్ కు కేవలం గుర్తింపు పొందిన విద్యా సంస్థ నుంచి పదోతరగతి ఉత్తీర్ణత అయితే సరిపోతుంది. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. వేతనం మొదటి నెల నుంచి అన్ని అలవెన్సులు కలిపి రూ : 37,815 వేతనం వస్తుంది. సబ్-స్టాఫ్ పోస్టులు 484 ఖాళీగా ఉన్నాయి.

అభ్యర్థుల నిర్ణిత వయస్సు 2023 మార్చి 31 నాటికి 18 ఏళ్ల నుంచి 26 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఓబీసీలకు 3 ఏళ్లు; దివ్యాంగులకు 10 ఏళ్లు; ఎస్టీ, ఎస్సీలకు 5 ఏళ్లు వరకు వయోపరిమితి సడలింపు ఇస్తూ అధికారులు నోటిఫికేషన్ లో ప్రకటించారు. ఓబీసీ, జనరల్ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు రూ.850 చెల్లించాలి. ఎస్టీ, ఎస్సీ, ఈఎస్ఎం, దివ్యాంగులు, అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు రూ.175 ఆన్లైన్ లోనే చెల్లించాలి.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ఆన్ లైన్ లో ఇంగ్లీష్ భాషలో పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా సెర్టిఫికెట్స్ పరిశీలిస్తారు. ఆ తరువాత వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. అన్ని సక్రమంగా ఉంటె ఉద్యోగానికి ఎంపిక చేసుకుంటారు. ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైనది. దరఖాస్తు చేసుకోడానికి చివరితేది 2024 జూన్ 27, ఆన్‌లైన్ లో పరీక్ష ఇదే ఏడాది జులై లేదా ఆగష్టు నెలలో నిర్వహిస్తారు. అక్టోబర్ నెలాఖరు నాటికి నియామకాలు పూర్తి చేస్తారు.

Author




(adsbygoogle = window.adsbygoogle || []).push({});