CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 21 June 2024, 2:17 pm Posted by : coalbelt 24 News

BEL jobs 2024: బెల్ లో రు:90,000 వేతనంతో ఉద్యోగ నియామకాలు

BEL jobs 2024 : హైదరాబాద్ లోని ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ – బెల్ కంపెనీ లో నిరుద్యోగులైన యువతీ, యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. నియామకానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

నియామకం చేసే ఉద్యోగాలు ఈ విదంగా ఉన్నాయి. జూనియర్‌ అసిస్టెంట్‌-3, ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ ట్రెయినీ-12, టెక్నీషియన్‌ సీ-17 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు బెల్ యాజమాన్యం ప్రకటించింది. ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ట్రేడ్‌లో మూడేళ్ల ఇంజినీరింగ్‌ డిప్లొమా పూర్తి చేసిన వారు ఇంజినీరింగ్​ అసెస్టెంట్​ ట్రెయినీ పోస్టుకు అర్హులు. బీకాం లేదా బీబీఎం అర్హత ఉన్నవారు జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ కోసం దరఖాస్తు చేసుకోడానికి అవకాశం ఉంది. అదేవిదంగా టెన్త్ పాస్ తోపాటు ఐటీఐ (ఎలక్ట్రానిక్స్‌ మెకానిక్‌/ ఎలక్ట్రికల్‌), ఏడాది పాటు అప్రెంటిస్‌షిప్‌ పూర్తిచేయాలి. లేదా టెన్త్ పాసై, మూడేళ్ల నేషనల్‌ అప్రెంటిస్‌షిప్‌ సర్టిఫికెట్‌ కోర్సు చేసిన వారు టెక్నీషియన్-సీ పోస్టు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

2024 జూన్ 1 నాటికి మూడు పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల నిర్నీత వయస్సు 28 ఏళ్ళు మించరాదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సి, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్లు, మాజీ సైనిక ఉద్యోగులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయసు సడలింపు ఉంటుంది. దరఖాస్తు చేసుకునే నాటికీ అభ్యర్థులు ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో తప్పక తమ పేరు నమోదు చేసుకొని ఉండాలి. రెనివల్ పడిపోయిన వారు దరఖాస్తు చేసుకోడానికి అనర్హులు. వెబ్​సైట్​ https://bel-india.in/ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు ధరఖాస్తు ఫీజుగా రూ.250. దీనికి అదనంగా 18శాతం జీఎస్​టీ చెల్లించాల్సి ఉంటుంది. దివ్యాంగులు, ఎక్స్​-సర్వీస్​మెన్, ఎస్టీ, ఎస్సీ అభ్యర్థులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని నోటిఫికేషన్ లో ప్రకటించారు. ​ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ ట్రెయినీ పోస్టుకు రూ.24,500 నుంచి రూ.90,000 వేతనం అందుతుంది. అదేవిదంగా టెక్నీషియన్, జూనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగస్తులకు రూ.21,500 నుంచి రూ.82,000 వరకు వేతనం వస్తుంది.

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను ముందుగా విద్యార్హతల ఆధారంగా షార్ట్ లిస్ట్ తయారు చేస్తారు. షార్ట్ లిస్ట్ ఆధారంతో రాత పరీక్షకు ఎంపిక చేస్తారు. రాత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.

Author




(adsbygoogle = window.adsbygoogle || []).push({});