CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 11 June 2024, 10:37 am Posted by : coalbelt 24 News

Parlament Speaker : ఆమేనా లోకసభ స్పీకర్ ???

Parlament Speaker : కేంద్రంలో ప్రమాణస్వీకార ఘట్టం ముగిసింది. మంత్రులకు శాఖల కేటాయింపు కూడా పూర్తయినది. మిగిలింది స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవుల కేటాయింపు. మోదీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తెలుగు దేశం పార్టీ తో పాటు జేడీయూ కీలక పాత్ర పోషించాయి. ఆ రెండు పదవులు తమకే కావాలంటూ పట్టుబడుతున్నట్టుగా రాజకీయ వర్గాల్లో ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. 2014, 2019 ఎన్నికల్లో బీజేపీ సంపూర్ణమైన మెజార్టీ సాధించింది. ఆ రెండు సందర్భాల్లో బీజేపీ ఎంపీ లే స్పీకర్, డిప్యూటీ స్పీకర్ అయ్యారు.

తాజాగా ఏర్పడిన మోదీ ప్రభుత్వానికి కావాల్సినంత మెజార్టీ లేదు. మిత్రులపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది. అదేవిదంగా కాంగ్రెస్ పరిస్థితి గతంలో కంటే ఇప్పుడు మెరుగయినది. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ తనవాళ్లు ఉంటేనే కాంగ్రెస్ ను ఎదుర్కొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకనే బీజేపీ తన వాల్లనే స్పీకర్, డిప్యూటీ స్పీకర్ గా నియమించుకోవాలనే పట్టుదలతో ఉంది.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

స్పీకర్ పదవిపై ఆశలు పెట్టుకోవద్డు అంటూ బీజేపీ పెద్దలు తెగేసి చెప్పేసినట్టుగా బీజేపీ వర్గాల సమాచారం. కావాలంటే డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తామంటూ కొంతమేరకు బీజేపీ పెద్దలు తగ్గినట్టు సమాచారం. చంద్రబాబు కూడా తన వాళ్ళకే స్పీకర్ పదవి కావాలని పట్టుబడుతున్నట్టు టీడీపీ వర్గాల సమాచారం. చంద్రబాబు కోరుతున్న విషయం మీడియా చేస్తున్న ప్రచారమా, లేదంటే టీడీపీ
శ్రేణులు చేస్తున్న ప్రచారమా అనేది స్పష్టత లేదు.

కానీ బీజేపీ పెద్దల దృష్టి మాత్రం పురందేశ్వరి పై పడినట్టు రాజకీయ వర్గాల సమాచారం. ప్రస్తుతం ఆమె ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. ఆమెకు స్పీకర్ పదవి కేటాయిస్తే చంద్రబాబు కూడా చల్లబడుతారు. అయన కూడా పెద్దగా అడ్డుతగిలే అవకాశాలు ఉండవు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కుమార్తె కావడంతో అయన కుటుంబానికి గౌరవం ఇచ్చినట్టు అవుతుంది. గతంలో ఆమె కాంగ్రెస్ ప్రభుత్వం హాయంలో కేంద్ర మంత్రిగా భాద్యతలు నిర్వహించిన అనుభవం ఉంది. విద్యావంతురాలు. అదే విదంగా పార్టీ అభివృద్ధికి కూడా ఉపయోగపడుతుంది. మహిళలను గౌరవించినట్టు కూడా అవుతుంది. ఎన్టీఆర్ కుమార్తెగా పురందేశ్వరికి స్పీకర్ పదవి కట్టబెడితే సినిమా పరిశ్రమను కూడా గౌరవించినట్టు అవుతుందనే ఆలోచనలో బీజేపీ పెద్దలు ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.

Author




(adsbygoogle = window.adsbygoogle || []).push({});