Singareni Award : సింగరేణికి అత్యుత్తమ అవార్డు
Singareni Award : సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ సంస్థకు అత్యుత్తమ అవార్డు లభించింది. 2023-2024 లో సంస్థ పనితీరుకు ఈ అవార్డు దక్కింది. ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డును ఇండియన్ ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్ సంస్థ అందజేసింది. 24వ జాతీయ స్థాయి చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారుల సమావేశం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ముస్సోరిలో జరిగింది. ఈ సమావేశంలో అవార్డు అందజేశారు. సింగరేణి సి అండ్ ఎండి బలరాం తరపున ఆపరేషన్, పర్సనల్ డైరెక్టర్ ఎన్‌వీకే శ్రీనివాస్ అవార్డును అందుకున్నారు. 2023-2024 లో సింగరేణి అధికారులు,...