CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 02 June 2024, 12:54 pm Posted by : coalbelt 24 News

Hari Hara Veeramallu : హరి హర వీరమల్లు కు కొత్త దర్శకుడు ఎవరంటే

Hari Hara Veeramallu : ప్రముఖ తెలుగు సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నిన్నటి వరకు ఎన్నికల్లో తీరిక లేకుండా గడిపారు. మరి కొద్ది గంటల్లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలను వెల్లడించడానికి కేంద్ర ఎన్నికల కమిషన్ సిద్ధమవుతోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజా ఎన్నికల్లో పిఠాపురం నుంచి విజయం సాధించబోతున్నారని పార్టీ విశ్వసిస్తోంది. దాదాపుగా మంత్రి వర్గంలో పవన్ కళ్యాణ్ కు బెర్త్ కూడా దక్కే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఎన్నికల ముందు వరకు ఆయన పలు సినిమాలను ఒప్పుకున్నారు. వాటిని పూర్తి చేయాల్సిన అవసరం కూడా ఆయనకు ఉంది.

ప్రస్తుతం మూడు సినిమాలు అసంపూర్తిగా ఉన్నాయి. అందులో హరి హర వీరమల్లు కూడా ఒకటి. ఒప్పుకున్న మూడింటిలో ముందుగా హరి హర వీరమల్లును పూర్తి చేయబోతున్నారు. ముందుగా ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహించారు. కొన్ని కారణాల వలన క్రిష్ దర్శకత్వం బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఎన్నికల ప్రచారం, పోలింగ్ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కొత్త దర్శకుడి కోసం అంతగా దృష్టి సారించలేదు. ఎన్నికలు ముగిసిన వెంటనే కొత్త దర్శకుడి కోసం సినిమా పెట్టుబడి దారులు దృష్టి సారించారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

యాబై శాతం పూర్తయిన సినిమా కు యువ దర్శకుడు జ్యోతి కృష్ణ చిత్రం మిగతా భాగాన్ని పూర్తి చేయడానికి ముందుకు వచ్చారు. చిత్ర నిర్మాత ఏ ఎం రత్నం కూడా సినిమాను వెంటనే పూర్తి చేయాలనే పట్టుదలతో ఉన్నారు. ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ నటించిన సినిమాల్లో ఏ సినిమా కూడా ఇంత ఆలస్యం కాలేదు. హరి హర వీరమల్లు ఒక్కటే చాలా నెలల నుంచి షూటింగ్ కు దూరంగా ఉంది. దర్శకుడు మారడం కూడా సినిమా ఆలస్యం కు కొంత కారణం కనబడుతోంది. రెండు భాగాలుగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మొదటి భాగాన్ని ఈ ఏడాది డిసెంబర్ లో విడుదల చేయడానికి నిర్మాత ఏఎం రత్నం ఏర్పాట్లు చేస్తున్నారు.

 

 

Author




(adsbygoogle = window.adsbygoogle || []).push({});