CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 31 May 2024, 2:35 pm Posted by : coalbelt 24 News

Sinima hall House full : ఆరోజు సినిమా హాల్ లు హౌస్ ఫుల్

Sinima hall House full : దేశవ్యాప్తంగ ఎన్నికల ఘట్టం ముగిసింది. జూన్ నాలుగున పార్లమెంట్ అభ్యర్థుల జాతకాలను వెల్లడించడానికి కేంద్ర ఎన్నికల కమిషన్ సిద్ధమవుతోంది. ఆరోజు అందరికి ఉత్కంట ఉంటుంది. ఎవరి అభిమాన నాయకుడు గెలుస్తాడా, ఎవరి నాయకుడి ఓటమిపాలవుతారో అంతుపట్టదు. ఫలితాలను చూడటానికి ప్రతి ఇంటిలో ఎవరో ఒక్కరు టీవీ కి అతుక్కు పోతారు. ఫలితాలు వెల్లడయ్యే వరకు టీవీ దాటి వెళ్లే పరిస్థితి ఉండదు.

అందరు ఇంటిలో ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం టీవీ ల ముందు కూర్చుంటే, ఆ రాష్ట్రంలో ఆరోజు సినిమా హాల్ కు వెళ్ళడానికి సిద్ధమయ్యారు. పెద్దమొత్తంలో సినిమా హాళ్లకు వెళ్ళడానికి నిర్ణయించుకోవడంతో ఆరోజు సినిమా హాళ్లు అన్ని హౌస్ ఫుల్ అని ఆ ఒక్క రోజు కు బోర్డు పెట్టేశాయి. ఆన్లైన్, ఆఫ్ లైన్ లో టికెట్ లన్ని కూడా నిండుకున్నాయి. ఆరోజు సినిమా హాల్ కు వెళుదామని కోరిక ఉన్నవారికి టికెట్ దొరకక నిరాశకు లోనయ్యారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

జూన్ నాలుగున ఓట్ల లెక్కింపును మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో సినిమా హాళ్లలో ప్రదర్శించడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇది తెలిసిన నాయకులు, కార్యకర్తలు టికెట్ బుకింగ్ చేసుకున్నారు. వెనుక వచ్చిన వారికి టికెట్లు లేవు అని థియేటర్ యాజమాన్యం బోర్డు పెట్టేయడంతో నిరాశతో వెనుతిరిగి పోతున్నారు.

ప్రతి రౌండ్, రౌండ్ కు విజయాలు తారుమారు అవుతాయి. ప్రజలతోపాటు నాయకులు, కార్యకర్తలు కూడా టీవీ లను వదిలి పెట్టారు. టీవీ కంటే వెండి తెర మీద ఆ ఎన్నికల ఫలితాలను చూస్తూ ఉంటె ఆ కిక్కే వేరు ఉంటది. ఆ కిక్కు కోసం మహారాష్ట్రలోని ముంబై ప్రజలు వెండితెర కు వెళ్లనున్నారు. ముంబై లోని సియాన్, కంజూర్ మార్గ్ లోని మ‌ల్టీప్లెక్స్ థియేటర్లు, పూణే, నాగపూర్ లోని పలు సినిమా థియేటర్లు హౌస్ ఫుల్ అయ్యాయి.

ఎన్నికల ఫలితాలను ఆరుగంటల పాటు ఏకధాటిగా ధియేటర్ లో ప్రత్యక్ష ప్రసారం చేయడానికి యాజమాన్యాలు ఏర్పాట్లు చేసుకున్నాయి. ఒక్కో టికెట్ ను మూడు వందలకు అమ్మారు. అయినా ప్రజలకు టికెట్ లు దొరకకపోవడం విశేషం.

Author




(adsbygoogle = window.adsbygoogle || []).push({});