CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 24 May 2024, 12:20 pm Posted by : coalbelt 24 News

Satya bhama :సత్యభామ వస్తోంది….

Satya bhama : కాజల్ అగర్వాల్ తెలుగు హీరోయిన్. గతంలో నటించిన పాత్రల కంటే బిన్నంగా నటిస్తోంది. క్రైమ్, ఆక్షన్ తరహాలో నటించిన సినిమా” సత్యభామ “. ఒక హత్య కేసును ఛేదించడంలో కాజల్ చేసిన నటన అద్భుతంగా ఉంది. గతంలో హీరోయిన్ లు పోలీస్ అధికారుల పాత్ర చేసిన సినిమాలు ఉన్నాయి. ప్రముఖ హీరోయిన్ విజయ శాంతి పోలీస్ అధికారి పాత్రను కర్తవ్యం సినిమాలో నటించి సాటిలేని నటిగా గుర్తింపు పొందింది. ఇప్పుడు విజయశాంతి ని మరిపించే రీతిలో కాజల్ అగర్వాల్ నటించింది.

సత్యభామ సినిమా షూటింగ్ ప్రారంభానికి ముందు కాజల్ గతంలో నిర్మించిన సినిమాలను పరిశీలించింది. కానీ వాటిలో కొన్నింటిని కాజల్ అంగీకరించలేదు. ఎట్టకేలకు దర్శకుడు సుమన్ చిక్కాల చెప్పిన కథతో అంగీకరించింది. పోలీస్ అధికారిణి పాత్రలో నటించి మెప్పించింది కాజల్. మర్డర్ జరిగిన తీరు ఒకవిదంగా చిత్రీకరించారు. ఆ మర్డర్ ను ఛేదించే పనిలో నిమగ్నమైన కాజల్ నటన మరోవిదంగా నిర్మించి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ఎక్కడ కూడా రెచ్చగొట్టే భావాలకు అవకాశం ఇవ్వకుండ చిత్రాన్ని నిర్మించారు. మహిళలు ఏ విదంగా రక్షణ పొందాలి. పోలీస్ స్టేషన్ కు వెళితే ఈ రోజుల్లో మహిళలకు న్యాయం జరుగుతున్నా తీరును కళ్ళకు కట్టినట్టుగా నిర్మిచారు. పలు కారణాల వలన సత్యభామ సినిమా వాయిదా పడింది. జూన్ 7న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబో తున్నారు. ఈ సినిమాలో కాజల్ తో పాటు ప్రకాష్ రాజ్, నాగినీడు, హర్షవర్ధన్, రవివర్మ, అంకిత్ కొయ్య, సంపద ఎన్, ప్రజ్వల్ యాద్మ ఈ చిత్రంలో నటిస్తున్నారు.

Author




(adsbygoogle = window.adsbygoogle || []).push({});