EX CM KCR : తెలంగాణ ఉత్సవాలకు కేసీఆర్ వెళ్లేనా ???
EX CM KCR : తెలంగాణ సాధన కోసం ఎందరో ప్రాణత్యాగం చేశారు. జైలు కు వెళ్లారు. లాఠీ దెబ్బలు తిన్నారు. ఉద్యోగులు ఆర్థికంగా నష్టపోయారు. సింగరేణి కార్మికులు సైతం సమ్మె బాట పట్టారు. అందరి పోరాటం ఫలించి ప్రజలు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నారు. రాష్ట్రము ఆవిర్భవించి పదేళ్లు పూర్తవుతోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. జూన్ రెండున ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్దమైనది. హైదరాబాద్ పరేడ్ మైదానంలో ఉత్సవాలను పదివేల మందితో రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించడానికి...