CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 13 May 2024, 2:47 pm Posted By: coalbelt 24 News

Allu Arjun : రాజకీయాల్లోకి వచ్చే ఉదేశ్యం లేదంటున్న బన్నీ

Allu Arjun : రాజకీయాల్లో నా మిత్రులు ఎవరు ఉన్న వారికి నా వ్యక్తిగతంగా మద్దతు ఉంటుంది. మా మావయ్య, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉన్నారు. ఆయనకు నా మద్దతు ఎల్లప్పుడూ ఉంటుంది. నంద్యాల పర్యటన గురించి హైద్రాబాద్ లో ఓటు వేసిన అనంతరం ప్రముఖ నటుడు అల్లు అర్జున్ మాట్లాడారు. 2019 ఎన్నికల్లో నంద్యాల నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే గా గెలిచిన రవి చంద్ర శేఖర్ రెడ్డి ని వ్యక్తిగతంగా కలుస్తా అని మాట ఇచ్చిన. కానీ ఆ మాట ప్రకారం కలువలేకపోయాను. మళ్ళీ ఎన్నికల్లో పోటీచేస్తున్న నేపథ్యంలో నా భార్య తో కలిసి వచ్చాను. శుభాకాంక్షలు తెలిపాను. అంతేగాని నాకు రాజకీయాలోకి వచ్చే ఉద్దేశ్యం ఏ మాత్రం లేదు అని నటుడు అల్లు అర్జున్ స్పష్టం చేశారు.

నంద్యాలలో ఏమి జరిగిందంటే ….




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ స్నేహితుడు, నంద్యాల ఎమ్మెల్యే, ప్రస్తుత వైసీపీ అభ్యర్థి రవి చంద్ర శేఖర్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలుపడానికి శనివారం వచ్చారు. అల్లు అర్జున్ తోపాటు ఆయన భార్య కూడా రావడం జరిగింది. అల్లు అర్జున్ పర్యటనకు నంద్యాల అభ్యర్థి ముందస్తుగా ఎన్నికల కమిషన్ నుంచి కానీ, పోలీస్ డిపార్ట్ మెంట్ నుంచి కానీ ఎలాంటి అనుమతి తీసుకోలేదు. కానీ బన్నీకి పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. మోటార్ సైకిళ్లతో ప్రదర్శన చేపట్టారు వైసీపీ నేతలు. అనుమతి లేని బన్నీ పర్యటనకు పోలీస్ శాఖా భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసింది. ఇది ఎన్నికల కమిషన్ దృష్టికి కూడా వెళ్లడంతో శాఖ పరంగా చర్యలు తీసుకుంటున్నారు సంబంధిత శాఖల అధికారులు.

 




(adsbygoogle = window.adsbygoogle || []).push({});