CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 05 May 2024, 8:21 am Posted by : coalbelt 24 News

మనదేశంలో మొదటిసారి ఈవీఎం ఎప్పుడు,ఎక్కడ వాడారు …

EVM First Use in :భారత దేశం అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం. మనదేశంలో ఎన్నికలు వచ్చాయంటే అదొక పండుగ. పరిపాలన కోసం ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటారు. ప్రజల కోసం చట్ట సభల్లో తమ గళాన్ని వినిపించేందుకు పోటీపడుతారు. పోటీ చేయడానికి నామినేషన్ వేస్తారు. నామినేషన్ వేసిన అభ్యర్థుల్లో ఒకరిని మాత్రమే ఓటర్లు తమ ఓటు హక్కు ద్వారా ఎన్నుకుంటారు. ఒక్కరే నామినేషన్ వేసి పోటీలో ఉంటె నాయకుని ఎన్నిక ఏకగ్రీవం అవుతుంది. దేశంలో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడానికి రాజ్యాంగ సంస్థ అయినటువంటి భారత ఎన్నికల కమిషన్ 1950, జనవరి 25, న ఏర్పాటైనది. ఎన్నికల కమిషన్ స్వతంత్ర వ్యవస్థ. సుప్రీం కోర్ట్ మాదిరిగానే ప్రభుత్వ నియంత్రణలో ఉండకుండా భాద్యతలను నిర్వహిస్తుంది. దేశంలోని రాష్ట్రాల్లో ఉన్న ఎన్నికల కమిషన్ లు కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ పరిధిలో ఉంది పనిచేయాల్సిందే.

 




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పార్లమెంట్ సభ్యులను ఎన్నుకునేందుకు ప్రతి ఐదేళ్ల కోసారి ఎన్నికలను నిర్వహిస్తుంది. దేశవ్యాప్తంగా 543 లోకసభ స్థానాలకు ప్రశాంతంగా ఎన్నికలను నిర్వహించ డానికి దశల వారిగా ఏర్పాట్లు చేస్తుంది కమిషన్. రాష్ట్రాల్లోని ప్రభుత్వాలకు కాలపరిమితి ముగిసిన నేపథ్యంలో ఐదేళ్లకోసారి నిర్వహించే ఎన్నికలకు కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేస్తుంది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలను ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ (EVM ) లతోనే నిర్వహిస్తున్నారు. ఈవీఎం లను మనదేశంలోని భారత ఎలక్ట్రానిక్ లిమిటెడ్, ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ అఫ్ ఇండియా అనే ఈ రెండు ప్రభుత్వ సంస్థలు తాయారు చేస్తున్నాయి. విద్యుత్ సరఫరా లేని ప్రాంతాల్లో కూడా ఈ యంత్రాలు పనిచేస్తాయి. ఆల్కలైన్ బ్యాటరీ సహాయంతో ఏ ఓటింగ్ యంత్రాలు పనిచేస్తాయి.

ప్రతి మిషన్ లో 3,840 ఓట్లు వేయడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆ పోలింగ్ కేంద్రంలో 3,840 మంది ఓటర్ల కంటే ఎక్కువ మంది ఓటర్లు ఉంటె మరో EVM ను ఉపయోగిస్తారు. పోలింగ్ స్టేషన్ లో ఒక మిషన్ 64 మంది అభ్యర్థులకే పనిచేస్తుంది. అంతకంటే ఎక్కువ మంది అభ్యర్థులు నామినేషన్ వేసి ఉంటె బ్యాలెట్ పేపర్ పద్దతిలో ఓటింగ్ నిర్వహించడానికి ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేస్తుంది. దేశంలో తయారైన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ మొట్టమొదటిసారి మన దేశంలోని కేరళ రాష్ట్రంలోని పరూర్ శాసన సభ నియోజకవర్గానికి 1982 లో ఉప ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో మొదటిసారి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ఉపయోగించి ఎన్నికలని నిర్వహించడంతో EVM ప్రజలకు తెలిసిపోయింది.
————————–
ఎడిటర్: పీఆర్ యాదవ్
9603505050
————————–

 

Author




(adsbygoogle = window.adsbygoogle || []).push({});