CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 03 May 2024, 8:23 am Posted by : coalbelt 24 News

నామా నాగేశ్వర్ రావ్ కు కేంద్రంలో మంత్రి పదవి ….కేసీఆర్

KCR Third Front : బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడుతున్నాడంటే ఆ మాటలు సంచలనం అవుతాయి. ఆ మాటల వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి అనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలవుతది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల ఖమ్మంలో మాట్లాడుతూ సంకీర్ణం బాంబు పేల్చారు. తన ప్రసంగంలో ఎంపీగా నామా నాగేశ్వర్ రావ్ ను గెలిపిస్తే కేంద్రంలో మంత్రి అవుతారు. మన కష్టాలు తీరుతాయి అంటూ మాట్లాడిన మాటలు బాంబ్ లా పేలాయి. ఈ మాటలు కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతోంది అని కేసీఆర్ జోస్యం చెప్పినట్టుగా చర్చ మొదలైనది. అంతే కాదు ఈ మాటలు కేంద్ర రాజకీయాల్లో ప్రకంపనలు తీసుకువచ్చాయి.

కేసీఆర్ మాట్లాడిన మాటలపై మోదీ స్పందించారు. ఇటీవల ఒక న్యూస్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు మోదీ. కేసీఆర్ మాట్లాడిన మాటలపై మోదీ స్పష్టంగా వివరన కూడా ఇచ్చేశారు. కేసీఆర్ కు ఒకసారి అవకాశం ఇచ్చాను. ఆయనే తిరస్కరించారు. కేసీఆర్ మరోసారి అడిగిన మొదటి సమాధానమే మా నుంచి వస్తుంది, కానీ మరో జవాబు ఉండదని కేసీఆర్ ను ఎన్డీయే లో చేర్చుకునే విషయంపై కుండబద్దలు కొట్టినట్టు తేల్చేశారు ఆ ఇంటర్వ్యూలో. అంటే కేసీఆర్ కు ఎన్డీయే కూటమిలో చేరడానికి తలుపులు మూతపడ్డాయి.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నామా నాగేశ్వర్ రావ్ మంత్రి పదవి గురించి మాట్లాడిన మాటలపై మొదటి అవకాశం మోదీ వద్ద లేనట్టే. రెండో అవకాశం కాంగ్రెస్. బీజేపీ కూటమికి మెజార్టీ రాని నేపథ్యంలో కాంగ్రెస్ తన మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఆ అవకాశమే వస్తే కేసీఆర్ ఇండియా కూటమి వైపు చూడక తప్పదు. కానీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి కేసీఆర్ కు బెర్త్ ఇవ్వడానికి ఒప్పుకుంటారా అనేది కూడా తేలాల్సి ఉంది. ఇప్పటికే రేవంత్ రెడ్డి కాషాయం, గులాబీ రెండు ఒకటే అని ఆరోపిస్తున్నారు. ఇప్పుడు బిఆర్ఎస్ వస్తానంటే ఎలా ఒప్పుకుంటారు అని రాజకీయవర్గాలు అభిప్రాయపడుతున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి గులాబీ నేతల రాకను ఒప్పుకోరు. నామాకు మంత్రి పదవి ఎవరు ఇస్తారు అనేది పెద్ద ప్రశ్న. ఇండియా కూటమి, ఎన్డీయే కూటమి రెండు కూడా తలుపులు మూసివేసిన నేపథ్యంలో మిగిలిన అవకాశం థర్డ్ ఫ్రంట్. అంటే కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ కోసం కళలు కంటున్నారు అనేది రాజకీయవర్గాల అభిప్రాయం.
థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేసి తన చేతిలోనే పగ్గాలు పట్టుకోవడమే ముందున్న ఏకయిక మార్గం.

Author




(adsbygoogle = window.adsbygoogle || []).push({});