CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 24 April 2024, 5:31 am Posted by : coalbelt 24 News

నటుడు రజనీకాంత్ కూలి ఎంత అంటే ???

కోల్ బెల్ట్ ప్రతినిధి :

ప్రముఖ నటుడు రజనీకాంత్ తమిళం,తెలుగు,మలయాళం,హింది సినిమాల్లో నటనకు పెట్టింది పేరు. ఆయన సినిమా వస్తుందంటేనే అభిమానులు ఎన్నో ఆశలతో ఎదురుచూస్తుంటారు.ఆయనతో సినిమా తీస్తే పెట్టుబడిదారులకు బంగారం పండినట్టే.కాబట్టి ఆయనతో సినిమా తీయడానికి నిర్మాతలు అయన సమయం కోసం ఎదురుచూస్తుంటారు. ఆయన సమయం కేటాయిస్తే చాలు. వాళ్ళ పెట్టుబడి నాలుగంతలు అయినట్టే. అందుకే ఆయన రెమ్యునరేషన్ కూడా సినిమా సినిమాకు పెరిగిపోతోంది.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

తాజాగా ఆయన కొత్త సినిమాకు ఒప్పుకున్నాడు. ఆ సినిమా పేరు ఏప్రిల్ 22 న ఖరారు అయ్యింది.సినిమాకు “కూలి ” అనే పేరు ఖరారు చేసారు.ఈ చిత్రానికి ప్రఖ్యాత దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు.అదేవిదంగా ప్రముఖ సంగీత దర్శకుడు రవిచందర్ అనిరుద్ సప్తస్వరాలు అందిస్తున్నారు. చిత్రాన్ని సన్ పిక్చర్ సంస్థ నిర్మిస్తోంది.మలయాళం,తెలుగు,హింది,తమిళం భాషల్లో నిర్మిస్తున్నారు.మొదటి షూటింగ్ ను మాత్రం సముద్రపు ఓడరేవులపై నిర్మించారు. అందుకు సంబందించిన దృశ్యాలను విడుదల చేసారు.ఓడరేవులపై నిర్మించిన పోరాట దృశ్యాలు కనీసం మూడు నిముషాలు ఉన్నాయి.ఈ ఫయిటింగ్ దృశ్యాలు ప్రేక్షకులతోపాటు అభిమానులను ఉర్రూతలూగిస్తాయి. ఓడరేవులపై రజనీకాంత్ ఇచ్చిన ఎంట్రీ దృశ్యాలు చిసినంత సేపు చూడాలనిపించేరీతిలో చిత్రీకరించినట్టు నెటిజన్ల చెప్పుకుంటున్నారు.

ఈ భారీ ఎత్తున నిర్మిస్తున సినిమాకు నటుడు రజనీకాంత్ భారీ ఎత్తున పారితోషకం తీసుకున్నట్టుగా సినీ పరిశ్రమలో పెద్ద ఎత్తున పుకార్లు కూడా వినిపిస్తున్నాయి.రజనీకాంత్ తీసుకునే రెమ్యునరేషన్ ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఇండస్ట్రీలో మాత్రం నిజమే అంటున్నారు. ఇంతకూ ఆయన “కూలి “సినిమాకు తీసుకుంటున్న రెమ్యునరేషన్ అక్షరాల రెండువందల ఎనబై కోట్లు అని చిత్రపరిశ్రమలో గుసగుసపెట్టుకుంటున్నారు. ఇదేగనుక నిజమైతే ఆసియా కాండంలోనే అతిపెద్ద పారితోషకం తీసుకున్న నటుడిగా గుర్తింపు వస్తుంది.

—————————–
ఎడిటర్: పీఆర్ యాదవ్
9603505050
—————————-

Author




(adsbygoogle = window.adsbygoogle || []).push({});