సీఎం జగన్ వాటి గురించి ఎందుకు మాట్లాడుతలేడు

కోల్ బెల్ట్ ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండోసారి సీఎం పదవి చేపట్టడానికి విస్తృత ప్రచారం చేస్తున్నాడు. ప్రతిపక్షాలను ఒంటరిగానే ఎదుర్కొంటున్నాడు.ఎక్కడ కూడా పొత్తులకు వెళ్ళలేదు. బీజేపీ,తెలుగుదేశం,జనసేన పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి.ఈ కూటమి జగన్ ను ఎలాగయినా ఇంటికి పంపాలని ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు.అదేవిదంగా సొంత చెల్లెలు,కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల తన అన్న తోనే పోరాటం చేస్తోంది.తెలంగాణలో పార్టీ పెట్టి కేసీఆర్ పై పోరాటం చేస్తూనే పాదయాత్ర చేపట్టింది.రాజకీయ ప్రకంపనాల నేపథ్యంలో షర్మిల పుట్టింటికి వచ్చి...