ఆ ఊరిలో ఒక్కరు కూడా ఓటు వేయలేదు

కోల్ బెల్ట్ ప్రతినిధి: పార్లమెంట్ పండుగ దేశవ్యాప్తంగా ఆరంభమైనది.మొదటి విడత పోలింగ్ ఈ నెల 19న ముగిసింది. ఎన్నికల నిర్వహణ ఆరోగ్యకరమైన వాతావరణంలో పూర్తి చేయడానికి కేంద్ర ఎన్నికల కమిషన్ తనదయిన శైలిలో ఏర్పాట్లు చేసింది. రోడ్ సౌకర్యం లేని ప్రాంతాలకు గుర్రాలు,ఒంటెల ద్వారా ఎన్నికల సామాగ్రిని తరలించారు. దట్టమైన అటవీప్రాంతంలోకి సిబ్బంది వెళ్ళడానికి హెలికాఫ్టర్ ద్వారా ఎన్నికల సామగ్రి, సిబ్బందిని తరలించారు.మావోయిస్టు ప్రాభల్యమున్న మారుమూల అటవీప్రాంతంలో ప్రజలు స్వచ్చందంగా ఓటు వేయడానికి భారీ బందోబస్తు ఏర్పాటు చేసారు. అవసరానికి మించి పోలీస్ బలగాలను...