ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా ఆ పాత్ర చేయను :చిరంజీవి

కోల్ బెల్ట్ ప్రతినిధి: చిరంజీవి కి సినీ పరిశ్రమలోకి ప్రవేసించేనాటికి తనకంటూ ఆదుకునేవారు ఎవరూ లేరు. పెద్ద దిక్కు అంటూ ఎవరు లేరు.మద్రాస్ లో అడుపెట్టినప్పుడు అతనికంటే సీనియర్ ఆర్టిస్టులు సినిమా కోసం వచ్చానంటే హేళనగా మాట్లాడారు. చిన్న చూపు చూశారు. అయినా మానసికంగా కుంగిపోలేదు. పరిశ్రమను విడిచి ఇంటికి తిరిగిరాలేదు.నటనలో శిక్షణ తీసుకున్నాడు. పరిశ్రమలో తనకు ఎవరు అండగా లేనప్పటికిని ఆ శిక్షణనే నమ్ముకున్నాడు. పరిశ్రమలో అవకాశాల కోసం ఎదురుచూస్తున్నాడు.వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నాడు.ఒక్కో మెట్టు ఎదుగుతూ పద్మశ్రీ అవార్డును సొంతం చేసుకున్నాడు.చిత్ర...