కాంగ్రెసును ముప్పుతిప్పలు పెడుతున్న మూడు స్థానాలు

కోల్ బెల్ట్ న్యూస్:హైదరాబాద్ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో 14 స్థానాలను దక్కించుకోవాలని పట్టుదలతో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇప్పటివరకు 14 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.తెలంగాణలోనే భారీ ఎత్తున తుక్కుగూడలో బహిరంగ సభ నిర్వహించి ఎన్నికల మ్యానిఫెస్టోను సైతం విడుదల చేసింది. దేశంలో ఎక్కడ కూడా విడుదల చేయకుండా కేవలం తెలంగాణలోనే మేనిఫెస్టో ప్రకటించడంలో సీఎం రేవంత్ రెడ్డి సఫలీకృతులయ్యారు. ఒకరకంగా చెప్పాలంటే ఢిల్లీ పెద్దల వద్ద రేవంత్ రెడ్డి అంటే పదిమంది పెద్ద నాయకుల తలలో నాలుకలా తయారయ్యాడు.కొంతవరకు సీఎం రేవంత్ రెడ్డి మాటకు...