ఆమ్ ఆద్మీ పార్టీకి ఎదురుదెబ్బ…మంత్రి రాజీనామా

ఈడీకి బయపడే రాజీనామా కోల్ బెల్ట్ ప్రతినిధి: ఢిల్లీలో ప్రభుత్వాన్ని నడుపుతున్న ఆమ్ ఆద్మీ పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. కొందరు అరెస్ట్ అవుతుండగా, మరికొందరు పార్టీని వీడుతున్నారు.తాజాగా కేజ్రీవాల్ మంత్రివర్గంలోని సాంఘిక సంక్షేమ శాఖా మంత్రిగా భాద్యతలు నిర్వహిస్తున్న రాజ్ కుమార్ ఆనంద్ ఎవరు ఊహించని రీతిలో మంత్రి పదవితోపాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి సైతం రాజీనామా చేశారు.ఈ నేపథ్యంలో తోటి మంత్రివర్గ సహచరులు ఆయన రాజీనామాకు గల కారణాలు తెలుసుకోడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ అయన వారికి అందుబాటులో లేరు.ఆయన రాజీనామా...