ఆ భక్తులకు అమ్మవారు ఆడపడుచు
భ్రమరాంబాదేవికి సారె పెట్టడానికి కాలినడకన భక్తులు మల్లన్న దర్శనం ఉగాదిరోజు పవిత్రమైనది శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు ప్రారంభం కోల్ బెల్ట్ న్యూస్:శ్రీశైలం శ్రీశైల మల్లికార్జున స్వామి దేవాలయంలో ఉగాది మహోత్సవాలు శనివారం ప్రారంభమైనాయి.ఈ వేడుకలకు సుమారు పదిలక్షల పైబడి భక్తులు తమ మొక్కులు తీర్చుకునే అవకాశం ఉందని దేవస్థానం అధికారులు,పాలకవర్గం అంచనా వేస్తోంది.దర్శనం కోసం వేచిఉండే భక్తులకు అల్పాహారం,తాగునీరు ఉత్సవాలు ముగిసేవరకు అందించనున్నారు.కాలినడకన వచ్చే భక్తులకు దారిలో తాగునీరు, పందిళ్లు, వైద్యసదుపాయాలు ఏర్పాటుచేసింది ఆలయ కమిటీ.భక్తులు కోరినన్ని లడ్డు ప్రసాదాన్ని ఇవ్వనున్నారు.అభిషేకా లు,సర్వదర్శనాలను ఉత్సవాల...